ప్రభాస్..మారుతి ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్.. త్వరలో షూటింగ్ షురూ!

 ప్రభాస్..మారుతి ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్.. త్వరలో షూటింగ్ షురూ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో డైరెక్టర్ మారుతి(Maruthi)తో చేస్తున్న సినిమా ఒకటి. అనౌన్స్మెంట్ తోనే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది ఈ సినిమా. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 

ప్ర‌భాస్ కల్కి మూవీ ప్రమోషన్లలో భాగంగా అమెరికాలో నెల రోజులు విదేశాల్లో ఉన్న డార్లింగ్..హైదరాబాద్ చేరుకున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు షూటింగ్ లో బిజీ అవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న హార్రర్ కామెడీ ఫిల్మ్ షూటింగ్  లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభం అవుతుందని..ఆగస్టు లాస్ట్ వీక్ వరకు షెడ్యూల్  ఉంటుందని సమాచారం. అందుకోసం స్పెషల్ సెట్ ని అరెంజ్ చేసారట..ఇందులో ప్ర‌భాస్ తో పాటు..ఇత‌ర తార‌గ‌ణంపై షూట్ జ‌ర‌ప‌నున్నారు.

ప్ర‌భాస్ నుంచి రాబోయే మూవీస్ అన్నీ వరల్డ్ వైడ్  కాన్సెప్ట్ తో వస్తోన్న విషయం తెలిసేందే. దీంతో మారుతి డైరెక్షన్ లో మూవీ అనౌన్స్ చేయగానే డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.దీంతో కీల‌క‌మైన ప్రభాస్ టైంను మారుతి మూవీ కోసం కేటాయించారు. ఇక ఈ సినిమా హిట్ అయితే మారుతి రేంజ్..పాన్ ఇండియా లెవెల్లో వినిపించడం ఖాయం అని టాక్ నడుస్తోంది. 

ఈ మూవీకు రాజా డీలక్స్(Raja Delux) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్తలు బలంగా వినిపించాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు మరో రెండు టైటిల్స్ ను పరిశీలిస్తన్నారట మేకర్స్. అందులో ఒకటి రాయల్ కాగా, మరొకటి అంబాసిడర్. ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు ఫిక్స్ చేయనున్నారని సమాచారం. 

అయితే.. ఈ టైటిల్స్ ను లీక్ చేయడంలో కూడా ఒక స్టాటజీ ఉందట. అదేంటంటే.. ఈ రెండు టైటిల్స్ లో దేనికి మంచి రెస్పాన్స్ వస్తుందో అనేది తెలుసుకోవడానికే ఈ ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో రీద్దీ కుమార్ (Riddi kumar), మాళవిక మోహన్ (Malavika Mohan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్స్ నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Datt) మరో కీ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.