నా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలను అంతం చేస్తారేమో! : వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలను అంతం చేస్తారేమో! : వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో తాను పాల్గొనకుండా రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) అడ్డుకుంటోందని స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించింది. తనను డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘నేను ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూషణ్, ఆయన డమ్మీ సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ కోసం నియమించిన కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లందరూ బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందానికి సన్నిహితులే. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో నేను తాగే నీళ్లలో ఏదైనా కలిపి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. నన్ను డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందనే అంశాన్ని నేను తోసిపుచ్చలేను’ అని వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజియోకు అక్రిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదని వాపోయింది. అయితే వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆరోపణలను డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ కొట్టి పారేసింది. రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజియోకు అక్రిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరిందని తెలిపింది.