చార్ ధామ్ యాత్ర ప్రారంభం

చార్ ధామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర  ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శనివారం తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ద్వారాలు తెరిచారు.

డెహ్రాడున్: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చార్ ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శనివారం తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి ద్వారాలను 12.41 గంటలకు తెరిచారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి గంగోత్రి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖర్సాలీలోని యమునోత్రి ఆలయంపై కూడా భక్తులు హెలికాప్టర్ ద్వారా గులాబీ రేకులతో వర్షం కురిపించారు. ఆలయాల్లోని అమ్మవార్ల విగ్రహాలను పూజారులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.  యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు వెల్లడించారు. చార్ ధామ్ యాత్రకు అనుమతించే యాత్రికుల సంఖ్యపై రోజువారీ పరిమితి విధించే నిర్ణయాన్ని ధామి సర్కార్ శుక్రవారం వాపస్ తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయాన్ని ఈ నెల25న, బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల  27న తెరవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.