వచ్చే నెల ఆకాశ చేతికి మొదటి విమానం

వచ్చే నెల ఆకాశ చేతికి మొదటి విమానం

ముంబై: స్టార్టప్ క్యారియర్ అకాశ ఎయిర్ జూన్​లో  ముంబైలో తన మొదటి విమానాన్ని డెలివరీ తీసుకోనుంది.  ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్​కు అమెరికాలోని బోయింగ్ పోర్ట్‌‌‌‌ల్యాండ్ ఫెసిలిటీలో తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపింది. ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా ఇన్వెస్ట్​మెంట్లు ఉన్న అకాశ ఎయిర్ జూలై నాటికి తన  కార్యకలాపాలను ప్రారంభించనుందని సంస్థ తెలిపింది.  దేశీయ మార్గాల్లో మార్చి 2023 నాటికి 18 విమానాలను నడపాలని ఎయిర్‌‌‌‌లైన్ యోచిస్తోంది. మెట్రోతో పాటు టైర్ -2/3 నగరాలపై ఫోకస్​ చేసింది.   ముంబైకి చెందిన ఈ క్యారియర్ నిరుడు అక్టోబర్‌‌‌‌లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి నాన్-–అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందింది.  అధిక సామర్థ్యం గల 737 మ్యా క్స్,​ 737–-8-200 అనే రెండు రకాల 72 బోయింగ్  విమానాల కోసం కిందటి నవంబర్‌‌‌‌లో కంపెనీ అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌‌‌‌తో  9 -బిలియన్​ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ విమానాలకు సీఎఫ్​ఎం లీప్​బీ ఇంజిన్లు ఉంటాయి.