- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కోడేరు, వెలుగు: కోడేరు మండలంలో రైతుల ట్రాన్స్ఫార్మర్లు దొంగతనంగా అధిక ధరలకు అమ్ముకునోళ్లను నమ్మి ఓటు వేయొవద్దని, అలాంటి వారిని గుమ్మం కూడా దాటనివ్వొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావుతో కలిసి కోడేరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు.
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం కోండ్రావుపల్లిలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.

