ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. మార్చి 7న భూమిపూజ

ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. మార్చి 7న భూమిపూజ

హైదరాబాద్, రామగుండం రాజీవ్ జాతీయ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 7న (గురువారం) మధ్యాహ్నం 12.30 గంటలకు భారీ ఎలివేటెడ్ కారిడార్కు సికింద్రాబాద్ లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భారీ ఎలివెటెడ్ కారిడార నిర్మాణం.. 11.30 కిలోమీటర్ల పొడవు 6లేన్ల వెడల్పు తో  జరుగనుంది. దీంతీ సికింద్రాబాద్  సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నారు. కరీంనగర్ వైపు మెరుగైన రవాణ సదుపాయాలు కల్పించడంలో భాగంగానే హైదరాబాద్, రామగుండం రహదారికి మహర్ధశ పట్టనుంది. 

హైదరాబాద్ నుంచి కరీంనగర్ , రామగుండం పట్టణాలను కలిపే రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఇటీవల కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న సీఎం రేవంత్ రెడ్డి .. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతివ్వాలని లేఖను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ నిర్మాణానికి శుక్రవారం అనుమతులు జారీ చేసింది. దీంతో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మణాం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం రూ.2232 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.