కాంట్రాక్ట్​ను ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వమే : జీవన్ రెడ్డి 

కాంట్రాక్ట్​ను ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వమే : జీవన్ రెడ్డి 
  • కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

కరీంనగర్, వెలుగు : పంచాయతీ సెక్రటరీల నియామకంలో కాంట్రాక్ట్​ఉల్లఘించిన ప్రభుత్వం, వారిని చర్చలకు పిలవకుండా ఆలస్యం చేయడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. యూనియన్లు, సకల జనుల సమ్మెలు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు.

శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జేపీఎస్​లు నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పిన కేసీఆర్ సీఎం అయ్యాక మాటా మార్చారని విమర్శించారు. జేపీఎస్​లను ఉద్యోగాల్లోంచి తీసేస్తామనడం  సరికాదని, ప్రభుత్వం బేషరతుగా వారిని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.