ఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్

ఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని.. రాజకీయ వేదికగా బీజేపీ దాన్ని ఉపయోగించుకుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతుందని విమర్శించారు. బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ యువతను పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందంతోనే హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలిచిందని వినోద్ కుమార్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై యుద్ధం కొనసాగించాలని.. అసత్య ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగట్టాలన్నారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని.. మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.