సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం డ్రామా

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం డ్రామా

మునుగోడులో బీఎస్పీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ మండలంలో రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. 75 ఏండ్లు మునుగోడును దొరలే ఏలుతున్నారని..ఈసారి కచ్చితంగా బీఎస్పీ నుంచి బహుజనుడే విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ యాత్రకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వలే డబ్బు, మద్యం ఇస్తలేమని..ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, కమ్యూనిస్టులు ప్రజలకు చేసిన మోసాలను తనకు వివరిస్తున్నారని చెప్పారు. 

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజా ప్రతినిధులకు కార్లు, మహిళలకు చీరలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఒక డ్రామా అన్నారు. అంబేద్కర్ పేరు కాదు పెట్టాల్సింది..అంబేద్కర్ లాగా యువకులను చదివించాలన్నారు.