ఐపీఎల్ లాగా టీపీఎల్.. నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్ నిర్వహిస్తాం : వివేక్ వెంకటస్వామి

ఐపీఎల్ లాగా టీపీఎల్.. నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్ నిర్వహిస్తాం : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో క్రికెట్ అభివృధ్ధికోసం ఎంతో చేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గతంలో కాకా పేరు మీద ఐపీఎల్ లాగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహించామని గుర్తు చేశారు. టీపీఎల్ వల్ల తిలక్ వర్మ ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడని తెలిపారు. మరింతమంది టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వచ్చారని చెప్పారు. అందుకే ఇప్పుడు మళ్ళీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాకా కప్ ఫైనల్ మ్యాచ్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ వచ్చే నవంబర్ లో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్ నిర్వహిస్తామని ప్రకటించారు. క్రికెట్ కి టాక్స్ మినహాయింపు తీసుకొచ్చింది వెంకటస్వామి అని గుర్తు చేశారు. ఆయనవల్లే ఇండియాలో వరల్డ్ కప్ కూడా జరిగిందని తెలిపారు.  

 గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ  20 రోజులుగా టోర్నమెంట్ ఉత్సహంగా జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ని వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో 45 జట్లు పాల్గొన్నాయని వారందరు చక్కగా ఆడారని అన్నారు.