
ప్రతి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ప్రారంభమయ్యే పది రోజుల ముందు నుంచి ఏ స్టేషనరీ షాపు చూసినా విద్యార్థుల తల్లిదండ్రులతో కళకళలాడేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ప్రైవేట్ స్కూల్స్‌లోనే పుస్తకాలు కొంటుండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు స్కూళ్లలో బుక్ స్టేషనరీ అమ్ముతున్నారని, ఆ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్