హెల్మెట్ పెట్టుకోలేదని బైక్ కీతో పొడిచిండు

హెల్మెట్ పెట్టుకోలేదని బైక్ కీతో పొడిచిండు

రుద్రాపూర్ (ఉత్తరాఖండ్): ఈ కుర్రాడి నుదుటిపై దిగింది కత్తి కాదు.. బైక్ కీ. పొడిచిందేమో ట్రాఫిక్ పోలిస్.. పొరపాటున జరిగిన సంఘటన కాదిది, కోపం పట్టలేక చేసిందే. ఇంతకీ ఆ కుర్రాడు చేసిన తప్పేంటయ్యా అంటే హెల్మెట్పెట్టుకోకుండా బండి నడపడమే. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసుల చేతిలో గాయపడ్డ కుర్రాడు ఆస్పత్రిలో ఉన్న టైంలో తీసిన ఫొటో ఇది. ఈ విషయం తెలిసి ఆ ఊరి జనంతో పాటు, లోకల్ ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేసిన్రు. దీంతో ఈ గొడవకు కారణమైన పోలీసులు ముగ్గురినీ సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.