224 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌‌

224 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌‌
  • 431 పాయింట్లు పడి..చివరికి 224 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌‌

ముంబై: బ్యాంకింగ్‌‌, టెలికం, మెటల్ షేర్లు సెషన్ చివరిలో పెరగడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకొని లాభాల్లో ముగిశాయి. డిసెంబర్ నెల ఎఫ్‌‌ అండ్ ఓ ఎక్స్‌‌పైరి కావడంతో  గురువారం సెషన్‌‌లో హై వోలటాలిటీ కనిపించింది. 30 షేర్లున్న సెన్సెక్స్ 224 పాయింట్లు (0.37 శాతం)  పెరిగి 61,134 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌ 431 పాయింట్లు పడింది. నిఫ్టీ69 పాయింట్ల లాభంతో 18,191 వద్ద క్లోజయ్యింది.  డిసెంబర్ ఎఫ్‌‌ అండ్ ఓ ఎక్స్‌‌పైరి రోజు  ఇన్వెస్టర్లు తమ మంత్లీ పొజిషన్లను క్లోజ్‌‌ చేసుకున్నారని, దీనికి తోడు మెటల్స్, బ్యాంకింగ్‌‌, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు పెరగడంతో ఇండెక్స్‌‌లు లాభపడ్డాయని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహన్ అన్నారు. చైనా కరోనా రిస్ట్రిక్షన్లు ఎత్తేయడంతో డిమాండ్ రికవరీ అవుతుందనే ఆశలు పెరిగాయని పేర్కొన్నారు. ‘రెసిషన్ భయాలు ఉండడంతో రానున్న సెషన్లలో మార్కెట్ రేంజ్ బౌండ్‌‌లో కదిలే అవకాశం ఉంది’ అని వివరించారు. యూఎస్ మార్కెట్‌‌లు బుధవారం నష్టపోవడంతో గురువారం సెషన్‌‌ను దేశ మార్కెట్‌‌లు లాస్‌‌తో ప్రారంభించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే, బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం పెరగగా, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 0.09 శాతం తగ్గింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 82.82 వద్ద సెటిలయ్యింది.

డల్‌‌గా కేఫిన్‌‌ టెక్‌‌ లిస్టింగ్‌‌..

కేఫిన్‌‌టెక్ షేర్లు మార్కెట్‌‌లో ఫ్లాట్‌‌గా ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ షేర్లు ఐపీఓ ధర రూ.366 కంటే కేవలం 0.81 శాతం లాభంతో రూ.369 దగ్గర బీఎస్‌‌ఈలో లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.372 వరకు పెరిగిన షేర్లు చివరికి 0.54 శాతం లాస్‌‌తో రూ.364 దగ్గర సెటిలయ్యాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో రూ.367 దగ్గర కేఫిన్ టెక్ షేర్లు లిస్టింగ్  అయ్యాయి.