18 నెలల గరిష్టానికి డీమ్యాట్​ అకౌంట్లు

18 నెలల గరిష్టానికి డీమ్యాట్​ అకౌంట్లు
  • జులైలో 30 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్‌‌


ముంబై: స్టాక్​ మార్కెట్లు దూసుకెళ్తుండటంతో కొత్త డీమ్యాట్​ అకౌంట్ల ఓపెనింగ్​ జోరుగా సాగుతోంది. జులై నెలలో సీడీఎస్ఎల్​, ఎన్ఎస్​డీఎల్​ వద్ద  కొత్తగా 30 లక్షల డీమ్యాట్​ అకౌంట్లు ఓపెనయ్యాయి. జనవరి 2022 నుంచి చూస్తే ఒక నెలలో ఇదే అత్యధికం. కిందటి 12 నెలల సగటు 20 లక్షల కంటే కూడా జులై నెలలో ఓపెనయిన డీమ్యాట్ అకౌంట్లు ఎక్కువగానే ఉండటం విశేషం. 


ఫలితంగా మొత్తం డీమ్యాట్​ అకౌంట్ల సంఖ్య కొత్తహై అయిన 12.35 కోట్లకు చేరింది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆసక్తిపై మార్కెట్​ సెంటిమెంట్​ ఒకింత ఎక్కువగానే పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో నిఫ్టీ, సెన్సెక్స్​ల కంటే మైక్రో–క్యాప్​, స్మాల్​–క్యాప్​ ఇండెక్స్​లు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్​పై రిటెయిల్​ ఇన్వెస్టర్లలో మళ్లీ ఆసక్తి పెరిగింది. నిఫ్టీ, సెన్సెక్స్​ కొత్త హైలు రికార్డు చేస్తున్న నేపథ్యం రిటెయిల్​ ఇన్వెస్టర్లను మార్కెట్​వైపు రప్పిస్తోందని మాస్టర్​ క్యాపిటల్​ సర్వీసెస్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ అర్విందర్​ సింగ్​ నంద చెప్పారు. 


డెరివేటివ్స్​ ట్రేడింగ్​అంటే తెగ ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఎఫ్​ఐఐల పెట్టుబడులు, ప్రైమరీ మార్కెట్లో ఐపీఓలు, డొమెస్టిక్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్ల మద్దతు....అన్నీ కలిసి స్టాక్​ మార్కెట్లపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయని అన్నారు.