వుడ్స్​ ప్రాజెక్ట్ ను విస్తరిస్తున్న స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్

వుడ్స్​ ప్రాజెక్ట్ ను విస్తరిస్తున్న స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్

హైదరాబాద్, వెలుగు: రియల్​ఎస్టేట్​ డెవలపర్ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ గ్రూప్ తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ప్రాజెక్ట్ "స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ వుడ్స్ శంషాబాద్"ని మరో 100 ఎకరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. వుడ్స్ శంషాబాద్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అటవీ ప్రాంతం.  ఫేజ్–2లో మొత్తం 1,800–-3,500 చదరపు గజాల పరిమాణంలో 150 వ్యక్తిగత యూనిట్లను అందిస్తుందని స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్​ కీర్తి చిలుకూరి అన్నారు.

పర్యావరణ అనుకూలమైన నివాసాల కోసం డిమాండ్ ​పెరుగుతోందని చెప్పారు.  ఇందుకోసం ఇప్పటికే ఉన్న 4,50,000 చెట్లు  మొక్కలేగాకుండా 150 కంటే ఎక్కువ స్థానిక చెట్లను , 141 కంటే ఎక్కువ జాతుల పక్షులు,  126 స్థానిక ఫలాలను పెంచుతామని వివరించారు.  ఒకటో ఫేజ్​లో 60 ఎకరాల్లో 110 ఫామ్​ యూనిట్లను నిర్మించామని చెప్పారు.