న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ తీరుపై భారత్ మరోసారి మండిపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో మానవ హక్కుల ఉల్లంఘనను ఆపాలని డిమాండ్ చేసింది. పీవోకేలో ఇటీవల జరిగిన నిరసనల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్ ఈ అంశాన్ని యూఎన్‌లో లేవనెత్తింది.
యునైటెడ్ నేషన్స్‌లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ.. ‘‘పాక్ సైన్యం దురాక్రమణ, అణచివేత, వనరుల దోపిడీని నిరసిస్తూ పీవోకేలో జనం తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో అణచివేయడానికి పాక్ సైన్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది. దీన్ని వెంటనే ఆపాలి” అని అన్నారు.
