ధరణి అప్లికేషన్ల స్పెషల్ డ్రైవ్ ఆపండి : కలెక్టర్లకు ఆదేశం

ధరణి అప్లికేషన్ల స్పెషల్ డ్రైవ్ ఆపండి : కలెక్టర్లకు ఆదేశం

దేశ వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ లో సవరణల కోసం.. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంను నిలిపివేయాలంటూ.. అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు  రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.  మళ్ళీ ఆదేశాలు వచ్చే వరకు స్పెషల్ డ్రైవ్ ఆపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.  

మార్చి 1 నుంచి 9 వరకు  స్పెషల్‌‌ డ్రైవ్‌‌ను నిర్వహించి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ముందుగా  ప్రభుత్వం ఆదేశించించి. వరుస సెలవులు రావడంతో అన్ని అప్లికేషన్లకు సంబంధించి రిపోర్టులు సిద్ధం కాలేదు. దీంతో డ్రైవ్​ను 17 వరకు పొడిగించారు.  ఆ లోపు అన్ని అప్లికేషన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌‌ దరఖాస్తుల పరిశీల నకు తహసీల్దార్​ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు. 

ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్‌‌ దర ఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్‌‌లో కూడా దరఖాస్తుదారుడే ఉన్నాడా? లేడా? అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్రస్థాయి సర్వే చేపట్టి నివేదికలు సిద్ధం చేసుకున్నాయి. ధరణి పోర్టల్‌‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లకు లాగిన్‌‌ ఆదేశాలు రాగానే పెండింగ్‌‌ దరఖాస్తుల అప్రూవల్,​ ఆన్‌‌లైన్‌‌ వర్క్‌‌ త్వరలో ప్రారంభమవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.