న్యూసెన్స్ వెబ్ సిరీస్ నిలిపివేయాలి

న్యూసెన్స్ వెబ్ సిరీస్ నిలిపివేయాలి

పెనుబల్లి, వెలుగు: న్యూసెన్స్ వెబ్ సిరీస్​ను నిలిపివేయాలని పోలీసులకు జర్నలిస్టులు కంప్లైంట్ చేశారు. గతవారం ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన న్యూసెన్స్ అనే తెలుగు వెబ్ సిరీస్​లో జర్నలిస్టులను కించపర్చేవిధంగా ఉందని, జర్నలిస్టులు సెటిల్​మెంట్లు, భూదందాలు చేస్తుంటారని అసభ్యకరంగా చూపించారని ఆరోపించారు. ఈ విషయంపై మండల జర్నలిస్టులు వీఎంబంజర్ ఎస్సై సూరజ్ కు, సత్తుపల్లి రూరల్ సీఐకి వినతి పత్రాలను అందజేశారు.