'బ్రేక్' సమయంలో ఉద్యోగులు కూర్చోకుండా కుర్చీలు తీసేసిన యజమాని

'బ్రేక్' సమయంలో ఉద్యోగులు కూర్చోకుండా కుర్చీలు తీసేసిన యజమాని

ఓ స్టోర్ లో ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఓ యజమాని కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్రేక్ టైంలో స్టాఫ్ కూర్చోకుండా అక్కడున్న కుర్చీలను కూడా తీసేశాడు. ఈ విషయాన్ని రెడ్డిట్ తన పోస్ట్ లో వెల్లడించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చి, వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై భిన్న కామెంట్లు వస్తున్నాయి.

కస్టమర్ల కోసం కుర్చీలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఉద్యోగులు ఖాళీగా ఉన్న సమయంలో కూర్చోవడానికి మాత్రం ఒక్క కుర్చీ కూడా లేదు అంటూ ఓ రెడ్డిటర్ పోస్టులో పేర్కొన్నారు. స్టోర్ వెనుక భాగంలో ఒక కుర్చీ అందుబాటులో ఉంది. కానీ అది కూడా కేవలం యజమాని కోసమే అని వెల్లడించారు. దాంతో పాటు కుర్చీ ఫొటోను కూడా యూజర్ షేర్ చేశారు. ఈ ఫొటోలో ఓ కుర్చీ వెనుక భాగంలో ఇది ఉద్యోగుల కోసం కాదు అని ఓ పేపర్ పై రాయబడి ఉండడాన్ని గమనించవచ్చు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో పలువురు యూజర్సు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. విరామ సమయంలోనూ ఉద్యోగులు కూర్చోకుండా చేస్తోన్న యజమాని తీరుపై మండిపడుతున్నారు.