ఈ మెషిన్​​ నుంచి కథలు వస్తయ్

ఈ మెషిన్​​ నుంచి కథలు వస్తయ్

హైదరాబాద్​లో జరుగుతున్న​ బుక్​ ఫెయిర్​లో షార్ట్​ ఎడిషన్​ (షార్ట్​ స్టోరీ డిస్పెన్సర్) చూశారా? బటన్​ ప్రెస్​ చేశాక దాన్నుంచి ఓ పేపర్​ బయటికి వస్తుంది. అందులో ఓ చిన్న కథ ఉంటుంది. దొరికిన కొద్దిపాటి టైంలో అది చదివేయడమే. ఇదంతా ఇంటర్నెట్​ నుంచి కాసేపు రిలాక్స్​ అవ్వడానికేనట. ‘షార్ట్​ ఎడిషన్’​ అనే ఈ ఫ్రెంచ్​ పబ్లిషింగ్​ కంపెనీని 2011లో స్థాపించారు. చిన్న చిన్న కవితలు, కథలు, ఫిక్షనల్​ రైటింగ్స్​  వంటివి ప్రమోట్​ చేయాలన్నదే వీటి కాన్సెప్ట్​. కొత్త రైటర్స్​ను ఎంకరేజ్​ చెయ్యడం, పిల్లలకు లిటరేచర్​ గొప్పతనాన్ని చెప్పడమే టార్గెట్. ఇందులో టెన్త్​ క్లాస్​ పిల్లలు రాసిన కథలు కూడా ఉన్నాయి. లక్షమందికి పైగా రైటర్స్​ వీళ్ల కోసం స్టోరీస్​ పంపారు. ఎయిర్​పోర్ట్స్, రైల్వే స్టేషన్స్​. బ​స్టాప్స్​, లైబ్రరీస్, హాస్పిటల్స్, ఎగ్జిబిషన్స్​ వంటి కొన్ని చోట్ల వీటిని పెడుతుంటారు.  ఈ డిస్పెన్సర్​ మెషిన్​లో వన్​ మినిట్​, టు, ఫైవ్​ మినిట్స్​... ఇలా మనకు ఉన్న టైం బట్టి స్టోరీ సెలెక్ట్ చేసి చదువుకోవచ్చు. అంతా ఫ్రీగానే. మెషిన్​లో వాడిన పేపర్​ కూడా ఎకోఫ్రెండ్లీ. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా షార్ట్​ స్టోరీ డిస్పెన్సర్స్​ ఉన్నాయి. హైదరాబాద్​తో పాటు పుణె, చెన్నయ్​ సిటీల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికి 35 మిలియన్ల రీడర్స్​ ఈ డిస్పెన్సర్స్​ను వాడారు.