అక్కడంతే!  దేవుడు కరుణిస్తేనే గుడి నుంచి విడుదల..

అక్కడంతే!  దేవుడు కరుణిస్తేనే గుడి నుంచి విడుదల..

కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. పెళ్లైన వెంటనే నూతన వరుడికి కాళ్లు, చేతులకు బేడీలు వేసి దేవాలయంలో వదిలేస్తారట. దేవుడు కరుణించి ఆదేశిస్తేనే విడుదలై కాపురం చేయాలట. ఈ వింత సంప్రదాయాన్ని విజయపుర జిల్లా యంకంచి గ్రామంలోని ఒక తెగ వారు ఆచరిస్తున్నారు. ఈ సంప్రదాయం వందల సంవత్సరాలుగా వస్తోందని అక్కడి వారంటున్నారు. మజావర్ కుటుంబాలకు చెందిన మగపిల్లలకు పెళ్లికాగానే స్థానికంగా ఉన్న దావల్‌ మల్లిక్‌ అనే దేవాలయంలో వదిలేస్తారట. దేవుడు కరుణిస్తేనే వారి దేవాలయం నుంచి బయటకు వస్తారట. దేవుడి కరుణించే వరకు అందులోనే ఉంటారట.

ఇప్పటికీ 18 మంది పెళ్లికొడుకులు అక్కడే బేడీలతో కాలం గడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆరుగురికి దేవుడు కరుణించడంతో బేడీలు తొలగిపోయాయట. దాంతో వారిని ఇళ్లకు పంపించేసారట. ఇలా బేడీలు తొలగిపోయే వరకూ ఆ పెళ్లికొడుకులు సంసారం చేయడానికి వీలు లేదట. ఈ సంప్రదాయాన్ని మజావర్‌ కుటుంబం వారు మాత్రమే ఆచరిస్తున్నారు. ఇందుకు కారణం ఈ ఆచారం నేపథ్యం వారికి తెలీనప్పటికీ పెద్దలు చెప్పినట్టుగా ఆచరిస్తున్నారు.

 

 

అనే కుటుంబంలో ఈ వింత ఆచారం ఉంది. మగ పిల్లలకు వివాహం చేసి తక్షణం కాళ్లు, చేతులకు బేడీలు వేసేస్తారు. బేడీలు వేసుకున్న వారిని దావల్‌ మల్లిక్‌ అనే దేవాలయంలో వదిలేస్తారు. ఇప్పటికీ 18 మంది పెళ్లికొడుకులు బేడీలతో కాలం గడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆరుగురికి దేవుడు కరుణించడంతో బేడీలు తొలగిపోయాయట. దాంతో వారిని ఇళ్లకు పంపించేసారట. ఇలా బేడీలు తొలగిపోయే వరకూ ఆ పెళ్లికొడుకులు సంసారం చేయడానికి వీలు లేదట. ఈ సంప్రదాయాన్ని మజావర్‌ కుటుంబం వారు మాత్రమే ఆచరిస్తున్నారు. ఇందుకు కారణం ఈ ఆచారం నేపథ్యం వారికి తెలీనప్పటికీ పెద్దలు చెప్పినట్టుగా ఆచరిస్తున్నారు.