
చిలప్ చెడ్, వెలుగు: వీధి కుక్కల దాడుల్లో 8 గొర్రెలు చనిపోయిన ఘటన చిలప్ చెడ్ మండలం బద్రియ తండాలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని కడావత్ లక్ష్మణ్ కు చెందిన గొర్ల కొట్టంలో ఆదివారం ఉదయం కుక్కలు జొరబడి 8 గొర్రెలను కొరికి చంపేశాయి.
ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వీధి కుక్కలు నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.