మరో చిన్నారిని చంపేసిన వీధికుక్కలు

మరో చిన్నారిని చంపేసిన వీధికుక్కలు

హన్మకొండ జిల్లా కాజీపేటలో దారుణం. వీధికుక్కలు మరోసారి పిచ్చెక్కిపోయాయి. వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి చోటూపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చోటూ తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటి నిండా రక్తపుగాయాలతో పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్నారి చోటూ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

2023, మే 19వ తేదీ శుక్రవారం ఉదయం కాజీపేట రైల్వేపార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కొన్ని రోజులుగా కుక్కలు అన్నీ కంట్రోల్ లోనే ఉన్నాయి. ఎండలు పెరగటంతో మళ్లీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి.