ఇకపై కుక్కలకు ఆధార్ కార్డు.. క్యూఆర్ కోడ్

ఇకపై కుక్కలకు ఆధార్ కార్డు.. క్యూఆర్ కోడ్

ఆధార్ కార్డు మనుషులకే కాదు..ఇప్పుడు కుక్కలకు అందుబాటులోకి వచ్చింది. మనుషులకు తమ ఆధార్ కార్డులో వారి వ్యక్తిగత వివరాలు, చిరునామా ఎలాగైతే ఉంటుందో..అదే విధంగా కుక్కలకు కూడా దాని వివరాలతో కూడిన ఆధార్ కార్డు, డిజిటల్ క్యూఆర్ కోడ్ సిద్దమయ్యా్యి. 

ఈ  ఆధార్ కార్డులను తొలి విడతగా ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న 20 వీధి కుక్కల మెడలో వేశారు. ఈ కార్డులో..క్యూఆర్ కోడ్ లో ఆ కుక్కలు తిరిగే ఏరియా వివరాలు, దాని వయసు, స్టెరిలైజేషన్ చేశారా లేదా..? అలాగే టీకాల వివరాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ కుక్క యజమాని పేరు, అది తప్పిపోయినప్పుడు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు పొందుపర్చారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఈ వివరాలన్నీ తెలిసిపోతాయి. 

ముంబైలోని సాయన్‌ ప్రాంతానికి చెందిన అక్షయ్‌ రిడ్లాన్‌ అనే ఇంజినీర్‌.... వీధి కుక్కల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఓ డేటాబేస్‌ ఉండాలని భావించాడు. ఇందుకోసం తన మిత్రులతో కలిసి వీధి కుక్కల  సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఆధార్ కార్డు,  క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థను తయారు చేశాడు.  అందులో కుక్కల  పేర్లు, వాటికి ఆహారం అందించే వ్యక్తుల వివరాలు, వ్యాక్సినేషన్‌ రికార్డు, స్టెరిలైజేషన్‌ స్టేటస్‌, మెడికల్‌ హిస్టరీ వంటి వివరాలతో ఈ క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌లను మెడలో వేస్తున్నారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో వీధి శునకాలకు ఈ ట్యాగ్‌లు తగిలిస్తున్నారు. 

pawfriend.in పేరుతో తాను నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో ఐడీ కార్డులు జారీచేసి చేసిన వీధి కుక్కల వివరాలను పొందుపరిచామని  అక్షయ్‌ రిడ్లాన్‌ తెలిపాడు. ఈ ఐడీ కార్డులు వేసే సమయంలో ఆ కుక్కలకు టీకాలు కూడా వేయించామని చెప్పారు.  ముంబైలో  వీధి కుక్కలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేలా త్వరలో లొకేషన్‌ ఆప్షన్‌ను కూడా ఈ ఐడీ కార్డులకు జతచేస్తామన్నారు.