
జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల మండలం తుప్పుడగడ్డతాండలో గొర్రెల దొడ్డిపై సోమవారం రాత్రి వీధికుక్కలు దాడి చేశాయి. సుమారు 30 గొర్రెలను చంపేశాయి. మరో 40 గొర్రెలు తీవ్రంగా గాయపడినట్లు రైతు లస్కర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో 10 గొర్కెల పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. జడ్చర్ల మాజీ జడ్పీటీసీ కోడ్గల్యాదయ్య, మాజీ ఎంపీపీ లక్ష్మీశంకర్‌నాయక్ ద్వారా రూ.25 వేలు ఆర్థికసాయం అందించారు.