
- ఒకే రోజు18 మందిపై దాడి..ఆస్పత్రులకు పరుగులు తీసిన బాధితులు
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆదివారం ఒక్కరోజే చింతాల్ఏరియాలో వీధి కుక్కలు చిన్నారుల నుంచి వృద్ధుల దాకా మొత్తంగా 18మందిపై దాడి చేసి గాయ పరిచాయి. దీంతో కుక్కల కాటుకు గురైన బాధితులు సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్హాస్పిటల్స్కు పరుగులు తీశారు.
వీధి కుక్కల స్వైర విహారంపై బల్దియా ఆఫీసర్లు దృష్టికి పోయినా.. పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. గల్లీల్లో ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలపైనా దాడి చేస్తుండగా.. ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటికైనా వరంగల్ బల్దియా ఆఫీసర్లు స్పందించి వీధి కుక్కల దాడుల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.