కాగ జ్ నగర్, వెలుగు : నిర్బంధ శ్రమ దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ హెచ్చరించారు. శనివారం రాత్రి కాగజ్ నగర్ మండలం ఇస్గాంలోని ఎస్ స్టార్ ఎస్ ఇటుక బట్టీలో డీసీపీవో బుర్ల మహేశ్.. పోలీసులతో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మూడు నెలల పాపతో బాలింత, 50 ఏండ్ల మహిళ, 16 ఏండ్ల బాలుడు నిర్బంధ శ్రమదోపిడీకి గురవుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించారు. ఇటుక బట్టీ యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
