ఆ వార్తల్లో నిజం లేదు.. టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ సెలక్ట్ అవుతాడు: ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్

ఆ వార్తల్లో నిజం లేదు.. టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ సెలక్ట్ అవుతాడు: ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వెస్టిండీస్, USAలలో జరగబోయే 2024 T20 ప్రపంచ కప్ కు టీమిండియా నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కరేబియన్‌లోని స్లో పిచ్ లపై కోహ్లీ బ్యాటింగ్ సరిపోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి, సెలక్షన్ కమిటీ భావిస్తోందట. ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతను సెలక్టర్ అగార్కర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. కోహ్లీని జట్టు నుండి తొలగించినట్లు వచ్చిన నివేదికలను నమ్మలేకపోయాడు.

బ్రాడ్ మాట్లాడుతూ.. T20 ప్రపంచ కప్ 2024 కోసం కోహ్లి భారత జట్టులో సెలక్ట్ కాడనే వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అతడిని జట్టులోకి ఎంపిక చేయడం ఖాయమని చెప్పాడు. USAలో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో కోహ్లీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని.. అతను ప్రపంచంలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ అని బ్రాడ్ తన ఎక్స్ (X) లో తెలిపాడు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో బీసీసీఐ అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే.    

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కేవలం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. తొలి టీ20 మ్యాచ్ కు దూరం కాగా రెండో మ్యాచ్ లో 29 పరుగులు చేశాడు. ఇక మూడో టీ20లో తొలి బంతికే ఔటయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎంత  మరి ఐపీఎల్ ప్రదర్శన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ఆశలను సజీవంగా ఉంచుతుందో లేదో చూడాలి.