ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు .. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 389/9

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు ..  రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 389/9

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (106 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 91) మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడు  జానీ బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టో (78), జాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాలీ (73) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో   ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో రోజు, శనివారం ఆట చివరకు 389/9 స్కోరుతో నిలిచింది. మొత్తంగా 377 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.  హోమ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే దూకుడుగా ఆడారు. 

ఓపెనర్​ క్రాలీ..  బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (42) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 79 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (42)తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  61 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి మంచి ఆరంభం ఇచ్చాడు. హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7) ఫెయిలైనా  జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెయిర్​స్టో జోరు చూపెట్టారు. ముఖ్యంగా రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ షాట్లతో అలరించాడు. 

ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జానీతో 110 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించిన అతను మర్ఫీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బౌల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ (29) కాసేపు పోరాడగా.. క్రిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1, మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9) ఫెయిలయ్యారు. ప్రస్తుతం బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు, మర్ఫీ మూడు వికెట్లు పడగొట్టారు.