హమ్మయ్య..  ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చేశాం.. 

హమ్మయ్య..  ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చేశాం.. 

మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న విద్యార్థుల్లో 75 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొంత మంది కోల్‌కతా మీదుగా ఈరోజు(ఏప్రిల్ 8) సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత విద్యార్థులను వారి వారి స్వస్థాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  మణిపూర్‌ అల్లర్లలో 50 మందికి పైగా చనిపోయారు. దాంతో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవటంతో  కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.


మణిపూర్‌లోని ఇంఫాల్ వర్సిటీ తోపాటు వేర్వేరు విద్యాసంస్థల్లో చదుకుంటున్న 103 మంది తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావటానికి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను పంపాయి.  వీటిలో ఓ విమానం 75 మంది విద్యార్థులతో ఓ విమానం సోమవారం ( మే8)  మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంది. మిగిలిన విద్యార్థులను కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తీసుకు రానున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటానికి ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చెందిన ఇద్దరు అధికారులను కోల్‌కతా పంపించినట్టు చెప్పారు. కోల్‌కతా నుంచి వచ్చే వారి కోసం టిక్కెట్లు బుక్ చేసినట్టు చెప్పారు.