హోల్డ్​లో విద్యార్థి హరీశ్ రిజల్ట్స్.. టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో డీబార్ అయిన విద్యార్థి

హోల్డ్​లో విద్యార్థి హరీశ్ రిజల్ట్స్.. టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో డీబార్ అయిన విద్యార్థి

హోల్డ్​లో విద్యార్థి హరీశ్ రిజల్ట్స్

టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో డీబార్ అయిన విద్యార్థి

కమలాపూర్, వెలుగు : టెన్త్ హిందీ పేపర్ లీకేజీ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థి దండబోయిన హరీశ్ రిజల్ట్స్ ను అధికారులు హోల్డ్‌‌లో పెట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​లో టెన్త్ హిందీ ఎగ్జామ్​ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు హరీశ్ వద్ద ప్రశ్నపత్రం లాక్కుని ఫొటో తీసుకుని, దానిని వాట్సప్ లో పెట్టడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అధికారులు హరీశ్ ను ఐదేండ్ల పాటు డిబార్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆ విద్యార్థి హైకోర్టుకు వెళ్లగా.. మిగతా పరీక్షలు రాసేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాల మేరకు అతను మిగతా పరీక్షలు రాశాడు. టెన్త్ లో 6 పరీక్షలకు గాను ఇంగ్లిష్, మ్యాథ్స్ మినహా మిగతా నాలుగు పరీక్షలకు అటెండ్ అయ్యాడు. అయితే, బుధవారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో హరీశ్ రిజల్ట్స్ ను అధికారులు హోల్డ్ లో పెట్టారు. అన్ని సబ్జెక్టులకూ మాల్ ప్రాక్టీస్ అని పేర్కొంటూ ఫెయిల్ కింద రిజల్ట్ చూపారు. ఎస్ఎస్ సీ బోర్డు తీరుపై హరీశ్ పేరెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పిదాన్ని సవరించి తమ బిడ్డకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.