జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీ హస్టల్లో ఓ విద్యార్థి ఉరేసుకొని మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలోని శాంతినగర్‌కు చెందిన కుర్వ పరుశరాముడు బాచుపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్యాచులర్ఆఫ్ డిజైన్థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం తన రూమ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువకుడు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
