టీఎస్​పీఎస్​సీ క్వశ్చన్​ పేపర్​ లీకేజీపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

టీఎస్​పీఎస్​సీ క్వశ్చన్​ పేపర్​ లీకేజీపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

కామారెడ్డి/డిచ్​పల్లి/నిజామాబాద్ అర్బన్/కామారెడ్డిటౌన్, వెలుగు: టీఎస్​పీఎస్​సీ క్వశ్చన్​పేపర్​లీకేజీపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ బతుకులను ఆగం చేస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్​జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు నిర్వహించారు. టీఎస్​పీఎస్​సీ, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీడీఎస్ యూ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. క్వశ్చన్​పేపర్ లీకేజీకి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్​నాయకులు సురేష్, దినేశ్, ముఖేశ్, అరవింద్, శ్రీకాంత్ పాల్గొన్నారు. క్వశ్చన్​పేపర్​లీకేజీపై డిచ్​పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్​లో పీడీఎస్​యూ, ఏబీవీపీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. టీఎస్​పీఎస్​సీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆ సంఘాల లీడర్లు రాజేశ్వర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్​రెడ్డి డిమాండ్​చేశారు.

ఈ మేరకు బుధవారం నిజామాబాద్ నిఖిల్ సాయి చౌరస్తాలో సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు ఇప్పుడు పేపర్​లీకేజీ వ్యవహారంతో ఆందోళనలో ఉన్నారన్నారు. దీని వెనుక ఎవరున్నారో విచారణ చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. టీఎస్​పీఎస్ సీ ఆఫీసుకు వెళ్లి శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రం సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, శ్రీధర్ గౌడ్, వెంకటేశ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. క్వశ్చన్​ పేపర్​ లీకేజీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.   కొత్త బస్టాండు వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టౌన్ ప్రెసిడెంట్​నంది వేణు మాట్లాడుతూ.. పేపర్ల లీకేజీపై  ప్రశ్నించిన బీజేవైఎం లీడర్లపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. లీడర్లు రాజేశ్, సంతోశ్, రాజ్​గోపాల్, లింగం,  ప్రవీణ్, నరేశ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.