విద్యార్థిని బిల్డింగ్‌ పై నుంచి తోసేసిన తోటి విద్యార్థులు

V6 Velugu Posted on Sep 25, 2021

వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీలో దారుణం జరిగింది. సెకండ్ ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థుల మధ్య రాత్రి గొడవ జరిగింది. దీంతో సంజయ్ అనే స్టూడెంట్ ను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు మరో ఇద్దరు విద్యార్థులు. తీవ్రగాయాలైన సంజయ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనిపై దాడిచేసిన ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. సంజయ్ ది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి. వ్యవసాయ ఆధారిత కుటుంబం. కొడుకు మృతితో సంజయ్ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.  
 

Tagged Student, Building, Narsampet, thrown, Warangal, Balaji Polytechnic College

Latest Videos

Subscribe Now

More News