ఓయూ వీసీ రిజైన్ చేయాలి..వర్సిటీలో స్టూడెంట్ల నిరసన 

ఓయూ వీసీ రిజైన్ చేయాలి..వర్సిటీలో స్టూడెంట్ల నిరసన 

ఓయూ, వెలుగు :  సమస్యలను పరిష్కరించని ఓయూ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధికారులు వెంటనే రాజీనామా చేయాలని స్టూడెంట్లు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం వీసీ చాంబర్​లో బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ.. ఓయూలో  సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని, దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీ వేసినా ఇప్పటివరకు నివేదిక అందజేయలేదన్నారు.

ఆ కమిటీని తొలగించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని కోరారు.  ఓయూలో పెంచిన అన్ని కోర్సు లఫీజులను తగ్గించాలని, సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లోని అక్రమాలపై నిగ్గు తేల్చాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. ఏఐఎస్ఎఫ్ నేతలు కాంపల్లి కళ్యాణ్, ఆరెకంటి భగత్, అనిల్, అశ్వన్, కాంపల్లి సుశాంత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.