
స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజనింగ్ అయి 41మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు. థానేలోని దివా అగాసన్ ప్రాంతంలోని స్కూల్ మిడ్ డే మిల్స్ తిన్న తర్వాత విద్యార్థులు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి చదివే 41 మంది విద్యార్థులు కిచిడీ తిన్నారు. వెంటనే కడుపు నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ప్రారంభమైయ్యాయి. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రి నుంచి కొంతమంది డాక్టర్లను స్కూల్ కు పంపారు. అస్వస్థతకు గురైన పిల్లల్ని కాల్వలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు స్కూల్ చిచెన్ పరిసరాలను వంట పదార్థాల శాంపిల్స్ సేకరించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
#WATCH | Thane, Maharashtra | 38 students of Kalwa Sahyadri School admitted to the hospital due to the alleged food poisoning after eating 'Khichdi' served in school. pic.twitter.com/6GXt4rNuBy
— ANI (@ANI) October 1, 2024