ఫుడ్​ పాయిజన్​తో స్టూడెంట్లకు అస్వస్థత

ఫుడ్​ పాయిజన్​తో స్టూడెంట్లకు అస్వస్థత

సిద్దిపేట రూరల్, వెలుగు: స్టూడెంట్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ తల్లిదండ్రులు రెసిడెన్షియల్​స్కూల్​ ఎదుట ఆందోళనకు దిగారు. సిద్దిపేట పట్టణంలోని మైనారిటీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో గత నెల 26న ఫుడ్ పాయిజనింగ్​ జరిగి 25 మందికి పైగా స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం పిల్లలను చూడడానికి తల్లిదండ్రులు వచ్చారు. భోజనం బాగుండడం లేదంటూ స్టూడెంట్స్​చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్ లోని వంటలను పరిశీలించారు. భోజనం నాసిరకంగా ఉండడంపై ప్రిన్సిపల్, వార్డెన్, ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనాన్ని పెట్టడం వల్ల పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని,  పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.  గురువారం పేరెంట్స్ మీటింగ్ పెట్టి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వారిని అక్కడ నుండి పంపించారు. ఈ విషయమై స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా ప్రభుత్వం పంపిన బియ్యాన్నే తాము వండుతున్నామని చెప్పారు. 

ఫుడ్​ పాయిజన్​తో స్టూడెంట్లకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారంలో ఉన్న శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్​ పాయిజనింగ్​తో పలువురు ఇంటర్ ​స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం  వాంతులు, విరేచనాలు అవుతుండడంతో యాజమాన్యం వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించింది. కళాశాల బాధ్యుడు కిరణ్​కుమార్​మాట్లాడుతూ ఆహార పదార్థాలను పరిశీలించిన తర్వాతే స్టూడెంట్లకు అందజేస్తామని అన్నారు. వాతావరణ మార్పులు, తల్లితండ్రులు బయట నుంచి తీసుకువచ్చిన ఆహార పదార్థాల వల్ల పిల్లలు అస్వస్థతకు గురై ఉండొచ్చన్నారు. ప్రస్థుతం అందరి ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు.