అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ కాకపోతే.. అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ అవుతారు : హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి

అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ కాకపోతే.. అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ అవుతారు : హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆధునిక యుగంలో విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమను తాము అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకుంటూ ఉండాలని, లేదంటే అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ అవుతారని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచించారు. హార్టికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన "ఉద్యాన విద్య: ఉన్నత విద్యలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు" సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలనతో ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీపై పట్టు సాధించాలన్నారు. కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, పదిమందికి ఉద్యోగాలిచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. హార్టికల్చర్ విద్యతో పాటు వ్యవసాయం, అంతరిక్షం, విమానయానం, ఆధునిక సాంకేతిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, రిజిస్ట్రార్ భగవాన్, అసోసియేట్ డీన్ ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.