ప్రిన్సిపాల్ తిడుతూ.. కొడుతున్నాడు!.. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్టూడెంట్స్ ఆందోళన

ప్రిన్సిపాల్ తిడుతూ.. కొడుతున్నాడు!.. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్టూడెంట్స్ ఆందోళన
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో స్టూడెంట్స్ ఆందోళన 

జగిత్యాల, వెలుగు: ప్రిన్సిపాల్ బూతులు తిడుతూ, కొడుతున్నాడని రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిలాగడ్డ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ రవి తరచూ బూతులు తిడుతున్నాడని, క్లాస్‌ రూమ్‌ల్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అడిగే ఎవ్వరూ లేరని బెదిరిస్తున్నాడు’ అని విద్యార్థులు వాపోయారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని, స్కూల్ మేనేజ్ మెంట్ కు   చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెళ్లి  స్టూడెంట్స్‌కు నచ్చజెప్పి క్లాస్‌రూమ్స్ లోకి పంపించారు.