
సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఓయూలో బీఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని, టీచింగ్, నాన్ టీచింగ్ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తే చేశారు. ఈ నేపథ్యంలోనే ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నల్ల బెలూన్ లను ఎగిరేయడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. బెలూన్ లను స్వాధీనం చేసుకొని, పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.