
కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో చదివే స్టూడెంట్లుకు టీచరలు డిజిటల్ తరగతుల ద్వారా అధునాతన విధానంలో బోధించాలని, వారికి చదువుపై ఆసక్తి కలిగేలా చూడాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు. బుధవారం కాగజ్ నగర్‌లోని పెట్రోల్ పంప్ ఏరియా జడ్పీ హైస్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన, సౌకర్యాల గురించి ఆరా తీశారు. పుస్తకాలు చదవడం విద్యార్థులకు అలవాటు చేయాలన్నారు. టెన్త్ స్టూడెంట్లకు ఇప్పటి నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు. ఎంఈఓలు వాసాల ప్రభాకర్, తోట రమేశ్ బాబు, హెచ్ ఎంలు వెంకట రాజయ్య, ప్రమీల దేవి, పర్స చంద్రశేఖర్ ఉన్నారు.