టీచర్లను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు

టీచర్లను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు

ప్రత్యేక తరగతుల పేరుతో వేధిస్తున్నారంటూ ఏకంగా ఉపాధ్యాయులను చంపేడానికే విద్యార్థులు స్కెచ్ వేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశాయిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులను నిత్యం క్లాసులు తీసుకుంటూ, చదవమని విసిగిస్తున్నారని భరించలేని ఇద్దరు విద్యార్థులు వీరిని ఎలా కంట్రోల్ చేయాలని ఓ ప్లాన్ వేశారు. అందులో భాగంగా కొంత డబ్బు సమకూర్చుకొని రెండు కత్తులు కొనుగోలు చేసి, వారి స్కూల్ బ్యాగ్ లలో జాగ్రత్తగా స్కూల్ కి తెచ్చారు. తరగతి గదిలోనే ఆ ఉపాద్యాయులను నరికేయాలని పక్కాగా ప్లాన్ చేసిన ఆ విద్యార్థులను.. అదే తరగతిలోని ఓ విద్యార్థి వారి కదళికల్లో మార్పు గమనించింది. ప్రమాదాన్ని గ్రహించిన ఆ అమ్మాయి వెంటనే తన స్నేహితురాలితో చెప్పింది. ఇద్దరూ నిశ్చయించుకొని ప్రధానోపాద్యులు  వద్దకు వెళ్లి వారి అనుమానాన్ని తెలియజేశారు. 

వెంటనే స్పందించిన హెడ్ మాస్టర్ హుటాహుటిన వెళ్లి  వారి బ్యాగులు వెతికించగా... ఆ ఇద్దరి విద్యార్థుల వద్ద రెండు పదునైన కత్తులు దొరికాయి. దీంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. ఈ ఘటనతో భయపడిన విద్యార్థులు.. తరగతి గదిలో హాహాకారాలు చేశారు. ఆ తర్వాత వారిద్దరినీ ఆఫీసు రూమ్ కి పిలిచి విచారించగా... మీరూ, సైన్స్ మాస్టర్ భయంకరంగా విసిగిస్తున్నారని..
ఆ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి ఇలా చేశామని ఆ విద్యార్థులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాద్యాయులు స్పృహ తప్పి పడిపోయినట్టు సమాచారం. ఆ అమ్మాయి గనక గమనించి ఉండకపోతే రెండు ప్రాణాలు గాలిలో కలసిపోయేవని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.