నీలి నింగిలో సుందర దృశ్యం

నీలి నింగిలో సుందర దృశ్యం

వెలుగు, సిటీ ఫొటోగ్రాఫర్ : సిటీలో శుక్రవారం ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రచండ భానుడి చుట్టూరా రంగుల హరివిల్లు  కనువిందు చేసింది. ఖైరతాబాద్ వద్ద ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. సాంకేతికంగా దీనిని ‘సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాలో’ లేదా ‘22 డిగ్రీ హాలో’ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా వాన పడే ముందు లేదా పడ్డాక మంచు స్పటికాలపై సూర్యకాంతి 22 డిగ్రీల కోణంలో పడినప్పుడు ఏర్పడుతుందన్నారు. హాలోలు ఏర్పడటం సూర్యుడికి మాత్రమే పరిమితం కాదని, రాత్రివేళల్లో జాబిల్లికీ ఏర్పడుతుంటాయన్నారు.