బోధన్,వెలుగు: బోధన్ పట్టణంలోని విజయమేరి స్కూల్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. మంగళవారం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బోధన్ పట్టణంలోని 111 పోలింగ్ కేంద్రాలకు జోనల్ ఆఫీసర్లు 8మందిని, రిజర్వులో ఇద్దరిని కేటాయించినట్టు తెలిపారు.
అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్లు 111 మందిని, రిజర్వులో 44మందిని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ 111మందిని, రిజర్వులో 44మంధిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు ఉన్నారు.
