కోస్గి బస్టాండ్ లో.. ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు : ఎస్సై బాలరాజు

కోస్గి బస్టాండ్ లో.. ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు :  ఎస్సై బాలరాజు

కోస్గి, వెలుగు: కోస్గి బస్టాండ్ లో దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై బాలరాజు తెలిపారు. బస్టాండ్ లో అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఫింగర్  ప్రింట్​ డివైస్ తో తనిఖీ చేశారు. బస్టాండ్ లో రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి చెక్  పెట్టేందుకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ విలువైన వస్తువులు, బ్యాగులు, పర్సులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 100కు, లోకల్  పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.