జీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌పై అంబానీ కన్ను!..ఎస్సెల్ చైర్మన్ సుభాష్ చంద్ర సంచలన ఆరోపణలు

జీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌పై అంబానీ కన్ను!..ఎస్సెల్ చైర్మన్ సుభాష్ చంద్ర సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీపై ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర సంచలన ఆరోపణలు చేశారు. జీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను టేకోవర్ చేసి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. తాను అంబానీకి ఫోన్ చేసినా స్పందన రాలేదన్నారు. తన ఛానెళ్లపై నకిలీ వార్తల ప్రచారానికి సంబంధించి అంబానీకి లేఖ కూడా రాసినట్లు చెప్పారు. జీతో విలీనం, వాటాదారుల వివాదాల సమయంలో రిలయన్స్ జోక్యంపై చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్వెస్కోతో జరిగిన వివాదం కూడా జీపై ప్రభావం చూపే ప్రయత్నాల్లో భాగమేనని ఆరోపించారు. 

జీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ భారతీయ పారిశ్రామికవేత్తల ఆధీనంలోనే ఉండాలని అన్నారు. ఎస్సెల్ గ్రూప్ రుణాలకు సంబంధించిన వ్యక్తిగత హామీ వ్యవహారంలో చంద్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.22 వేల కోట్లకు పైగా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ల నేపథ్యంలో ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ సెటిల్మెంట్‌‌‌‌‌‌‌‌కు ఆమోదం తెలిపిన వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై రిలయన్స్ స్పందన రావాల్సి ఉంది.