'సుబ్రహ్మణ్యపురం' కాంబో రిపీట్

'సుబ్రహ్మణ్యపురం' కాంబో రిపీట్

హిట్స్,ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు హీరో సుమంత్. సుబ్రహ్మణ్యపురం,లక్ష్య సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్లో సుమంత్ మరో సినిమా చేస్తున్నాడు. ఇప్నటికే వీరి కాంబోలో వచ్చిన సుబ్రహ్మణ్యపురం సినిమా మంచి హిట్ కాగా ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఈ కొత్త సినిమాను ఆదివారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్కు  గురిచేసే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.