హెలికాప్టర్ ప్రమాదంపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

హెలికాప్టర్ ప్రమాదంపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

సీడీఎస్ బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం పై రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిడిఎస్ బిపిన్ రావత్ మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. ఈ సంఘటన "షాకింగ్" అని  దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక అన్న  సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దుర్ఘటన పై ఫైనల్ రిపోర్ట్ రాలేదన్నారు. కాబట్టి ఏదైనా చెప్పడం చాలా కష్టం అన్నారు. కానీ తమిళనాడు లాంటి సేఫ్ జోన్‌లో ఉన్న మిలటరీ హెలికాప్టర్  పేలిన విషయం సాధారణం కాదన్న సుబ్రహ్మణ్య స్వామి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో తీవ్రమైన దర్యాప్తు అవసరమని… ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విషయాన్ని విచారించాలని సుబ్రమణ్యస్వామి కోరారు. 

మరోవైపు రావత్ పార్థివదేహం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకోనుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రావత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. తమిళనాడు వెల్లింగ్టన్ లోని మద్రాసు రెజిమెంటల్ కేంద్రానికి వెళ్లిన తమిళసై రావత్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ మీద చికిత్స అందిస్తున్నారు.