రక్షణ రంగంలో మరో ముందడుగు

రక్షణ రంగంలో మరో ముందడుగు

భారత రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. ఆయుధాలు తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మరో అద్భత ప్రయోగం చేపట్టింది. మనుషులు లేకుండానే ఓ విమానాన్ని తయారు చేసింది. ఈ మానవ రహిత యుద్ధ విమానాన్ని పరీక్షించింది. అత్యంత వేగంగా దూసుకపోయిన ఈ విమానం.. సేఫ్ గా ల్యాండ్ కావడంతో DRDA శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు నింపింది. కర్నాటకలోని చిత్ర దుర్గ ఏరోనాటికల్ (Chitradurga Aeronautical)లో పరీక్ష నిర్వహించారు. అభివృద్ధిలో ఘన విజయం అని పరీక్ష సక్సెస్ అనంతరం డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రయోగంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. అపూర్వమైన ఘనత సాధించారంటూ ప్రశంసించారు. 

డీఆర్డీవో..ఎన్నో ప్రయోగాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రయోగాలు చేసింది. అందులో భాగంగా మానవ రహిత యుద్ధ విమానాన్ని తయారు చేసింది. బెంగళూరులోని ప్రధాన పరిశోధన ల్యాబరేటరీ ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏడీఈ) రూపొందించింది. ఈ విమానం కోసం పలు వ్యవస్థలను దేశీయంగానే అభివృద్ధి చేయడం విశేషం. మానవ రహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్డీవో (DRDO) విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. అత్యంత స్పీడుగా ప్రయాణించి.. సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఆత్మనిర్భర్ భారత్ కు మార్గదర్శనం చేశారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.