8 ఏండ్లుగా అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకు ఎన్నికలే పెట్టలే : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

8 ఏండ్లుగా అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకు ఎన్నికలే పెట్టలే  : సుడా చైర్మన్  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ బ్యాంకుకు ఎనిమిది ఏండ్లుగా పాలకవర్గం లేకపోవడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సిటీలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్​లో మాట్లాడుతూ సహకార రంగంలో కరీంనగర్ జిల్లాకు ఒక చరిత్ర ఉందన్నారు. అర్బన్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఆ దిశగా నడిపించడానికి మంచి పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని మెంబర్లను కోరారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అడ్డంకులన్నీ తొలగించి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఎక్కువ మంది అనుభవమున్న కాంగ్రెస్ లీడర్లు పోటీ చేస్తున్నందున ప్యానల్ ప్రకటించలేదన్నారు. లీడర్లు చర్ల పద్మ, దండి రవీందర్, బొబ్బిలి విక్టర్, చంద్, మహమ్మద్, జ్యోతిరెడ్డి,హసీనా, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శిల్ప పాల్గొన్నారు.